Tripura: మంత్రులు మారని బుద్దులు.. అసెంబ్లీలో పోర్న్ చూస్తూ..
Tripura BJP MLA seen watching porn in Assembly

Tripura: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే తన మొబైల్ ఫోన్‌లో పోర్న్ చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది కాస్తా కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ త్రిపుర యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది ఈ సంఘటన. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో పోర్న్ చూడటం విమర్శలకు దారితీసింది. త్రిపురలోని బగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తన ఫోన్‌లో అశ్లీల వీడియో చూస్తున్నారని జాతీయ మీడియా నివేదించింది. వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్ల నుండి అనేక విమర్శనాత్మక వ్యాఖ్యలను పొందుతోంది. మార్చి 27న త్రిపుర అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను ఎవరో వెనుక నుండి చిత్రీకరించినట్లు నివేదించబడింది. శాసనసభ్యుడు తన ఫోన్‌లో కొన్ని వీడియో ఫీడ్‌ల ద్వారా స్క్రోలింగ్ చేస్తున్నట్లు ఇది చూపిస్తుంది. అసెంబ్లీలో కూర్చొని అశ్లీల కంటెంట్‌ను చూస్తున్నట్లు వీడియోలో ఉన్నట్లు సమాచారం.
మొదటి ఉదాహరణ కాదు
అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అశ్లీల చిత్రాలు చేస్తూ కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారి కాదు. 2012లో కర్నాటక అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన ఆ రాష్ట్రంలోని నాటి బిజెపి ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు అసెంబ్లీలో అడల్ట్ కంటెంట్‌ను చూస్తూ కెమెరాకు చిక్కడంతో అభాసుపాలయ్యారు. దీంతో మంత్రులు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. అయితే, విచారణలో వారిపై ఎటువంటి అభియోగాలు లేకపోవడంతో తిరిగి నియమించబడ్డారు. ప్రస్తుత సంఘటన సంచలనంగా మారడంతో త్రిపుర బీజేపీ విభాగం ఆయనకు నోటీసులు పంపి వివరణ కోరనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com