Manya Singh : మిస్‌ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ బిడ్డా!

Manya Singh : మిస్‌ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ బిడ్డా!
X
Manya Singh : అందాల పోటిలంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ఇందులో డబ్బున్న అమ్మాయిలు వారే పాల్గొంటారని.. కానీ ఓ రిక్షా డ్రైవర్ తన‌ కూతురు అందాల కిరీటం గెలవాలని కల అనుకున్నాడు.

Manya Singh :అందాల పోటిలంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ఇందులో డబ్బున్న అమ్మాయిలు వారే పాల్గొంటారని.. కానీ ఓ రిక్షా డ్రైవర్ తన‌ కూతురు అందాల కిరీటం గెలవాలని కల అనుకున్నాడు. అయితే ఆ కల ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. వీఎల్‌సీసీ మిస్‌ ఇండియా పోటీలో రన్నరప్‌గా తన కూతురుని ప్రపంచం ముందు నిలబెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు ఆ తండ్రి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. వీఎల్‌సీసీ మిస్‌ ఇండియా పోటీలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా నిలిచింది. మాన్యా సింగ్ తండ్రి ఓం ప్రకాష్ సింగ్.. అయన ఓ ఆటోవాలా‌.. తల్లి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. పేదరికం కారణంగా మాన్య కొద్దివరకే చదువుకొని ఉద్యోగంలో చేరింది. ఇందులో తన డిగ్రి ఫీజు కోసం ఆమె తల్లి దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్నికూడా కుదువపెట్టాల్సి వచ్చింది.


తన ఖర్చుల కోసం ఇంట్లో పడుతున్న కష్టాన్ని చూడలేక మాన్య.. పద్నాలుగు ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఇంట్లోనుంచి వెళ్లిపోయి రాత్రిపూట కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేది. అయితే మిస్ ఇండియా పోటీల్లో గెలవాలని లక్ష్యం అలాగే ఉండడంతో ఎ‍న్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని, జాబ్ చేస్తున్నప్పుడు నడిచి వెళ్తు రిక్షా డబ్బులు కూడా దాచుకునే దాన్నని మన్యా తెలిపింది.

తన కుటుంబం పడ్డ కష్టం, వారందించిన సహకారం వల్లనే ఈ స్థానంలో నిలిచానని అంటుంది మాన్యా.. కాగా ఈ పోటిలో హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్‌గా నిలిచింది.


Tags

Next Story