ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో అలజడి

ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో అలజడి

ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో అలజడి రేగింది. మావోయిస్టుల నేతృత్వంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆదివాసి గిరిజనులు భారీగా హాజరయ్యారు. కరోనా వైరస్‌ ఆదివాసి ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోందని వారన్నారు. ప్రజలకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. రోజుకూలి 500 రూపాయలతో పాటు నిత్యావసరాలు కూడా ఇవ్వాలన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని.. అక్రమ కేసులు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు ఆదివాసి గిరిజనులు.


Tags

Next Story