world sleepy day: ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సవం.. హాయిగా బజ్జోండి..

world sleepy day: ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సవం.. హాయిగా బజ్జోండి..
world sleepy day: అదృష్టవంతులకు అట్లా పడుకోగానే ఇట్లా నిద్రపట్టేస్తుంది. కొంత మంది ఏ కాస్త ఖాళీ దొరికినా ఓ కునుకేసేస్తారు.

World Sleepy Day: అదృష్టవంతులకు అట్లా పడుకోగానే ఇట్లా నిద్రపట్టేస్తుంది. కొంత మంది ఏ కాస్త ఖాళీ దొరికినా ఓ కునుకేసేస్తారు. నిద్ర కూడా ఓ వరమే.. పడుకోగానే నిద్రపట్టేస్తే ఎన్నో మర్చిపోవచ్చు. మనసుకు ఎంతో స్వాంతన. నిద్ర ఎక్కువగా పోయేవారికి దేని గురించీ టెన్షన్ ఉండదు. లైఫ్ బిందాస్‌గా గడిపేస్తుంటారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం ఒక వరం! నిద్ర ఆరోగ్యకరమైన జీవనశైలికి మైలురాయి. ఎందుకంటే ఇది మన శరీరానికి స్వాంతనను, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. పునరుద్ధరిస్తుంది. మార్చి 17న ప్రపంచ నిద్ర దినోత్సవం, ఆరోగ్యకరమైన నిద్ర యొక్క ప్రయోజనాలను తెలియజేస్తూ, నిద్ర సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున, ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్‌లో మీమ్‌లను సృష్టించడం, జోకులు పోస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. వర్కింగ్ కార్పొరేట్లతో పాటు, ధర్మ ప్రొడక్షన్స్, నెట్‌ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్ కూడా మీమ్స చేయడంలో ముందున్నాయి. మెజారిటీ వ్యక్తుల మాదిరిగానే మీరు కూడా నిద్రను ఆస్వాదిస్తున్నట్లయితే మీరు కూడా ఈ మీమ్స్ చూసి ఎంజాయ్ చేయండి. బెంగళూరులోని కొన్ని కార్యాలయాలకు అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 17న తన ఉద్యోగులకు సెలవును ప్రకటించింది. “శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో మరియు చేతిలో ఉన్న పనిపై మళ్లీ దృష్టి కేంద్రీకరించడంలో మధ్యాహ్న నిద్ర ఉపకరిస్తుంది, అందుకే ఓ చిన్న నాప్ వేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి మరికొన్ని కంపెనీలు.

Tags

Next Story