Marriage Muhurtam: పెళ్లికి వేళాయే.. మూడుముళ్లకు ముహూర్తాలు..

Marriage Muhurtam: పెళ్లికి వేళాయే.. మూడుముళ్లకు ముహూర్తాలు..
Marriage Muhurtam: భారీగా జరిగే పెళ్లిళ్లు కొన్ని కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తాయి.

Marriage Muhurtam: కరోనా కాలంలో కళ్యాణం చేసుకుని ఏదో మమ అనిపించారు.. వచ్చిన నలుగురితో నాలుగు అక్షింతలు వేయించుకుని పెళ్లి అయిపోందనిపించుకున్న జంటలు ఎన్నో.. కానీ ఈ సారి కరోనా మహమ్మారి కనికరించింది. దాంతో ఇష్టమైన వారందరినీ పిలుచుకుని ఎంచక్కా పెళ్లి వేడుక చేసుకుంటున్నారు వధూ వరులు. ఏప్రిల్ 13 నుంచి జైన్ 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలియడంతో చాలా జంటలు ఒక్కటి కానున్నాయి.

కళ్యాణ మంటపాలు, కార్డు ప్రింటింగులు, బంగారం షాపులు, వస్త్ర వ్యాపారులు అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది ఈ సమయంలో. ఇక పురోహితులకు కూడా మంచి గిరాకీ పెళ్లిళ్ల సీజన్ లో.

శుభకృత్ నామ సంవత్సరంలో శుభకార్యాల ముహూర్త తేదీలు ఈ విధంగా ఉన్నాయని ప్రముఖ పండితులు పేర్కొన్నారు.

ఏప్రిల్ : 13, 14, 15, 16, 17, 21, 22, 24

మే: 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25

జూన్: 1, 3, 5, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23

కరోనా కష్టకాలంలో వ్యాపారం లేక నానా ఇబ్బందులు పడ్డ వ్యాపారులు పెళ్లిళ్ల సమయంలో నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఆశపడుతున్నారు. ప్రింటిగ్ ప్రెస్ వారు, బ్యాండ్ మేళం వారు, డెకరేషన్ చేసే వారు మళ్లీ మంచి రోజులు వచ్చాయని సంబర పడుతున్నారు. భారీగా జరిగే పెళ్లిళ్లు కొన్ని కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story