భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు..

భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు..
X
అంతర్జాతీయ మార్కెట్లో వీటి డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో దేశంలో

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో దేశంలో పసిడి ధరలు పడిపోవడానికి కారణమైంది. మంగళవారం ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం ధర తులానికి రూ.1,755 తగ్గి రూ.50,655కు జారుకుంది. 99.5 స్వచ్ఛత లోహం రేటు రూ.రూ.1,748 తగ్గి రూ.50,462కు పరిమితమైంది. కిలో వెండి ధర ఏకంగా రూ. 4,268 తగ్గి రూ.61,784కు దిగివచ్చింది.

హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,640 తగ్గి రూ.51,380కి చేరుకోగా, వెండి ధర కేజీకి రూ.3,500 తగ్గి రూ.61,900 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఒక దశలో 1,877 డాలర్ల వద్ద, వెండి రూ.24 డాలర్ల ఎగువన ట్రేడయింది.

కరోనా కష్ట కాలంలో బంగారం తాకట్టు రుణాలకు భారీగా డిమాంగ్ పెరిగిందని ప్రపంచ స్వర్ణ మండి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ లోన్ మార్కెట్ పరిమాణం రూ.4,05,100 కోట్లకు చేరుకోవచ్చని డబ్ల్యూజీసీ అంచనా. 2021-22లో రూ.4.61 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంటోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్‌ సైజు రూ.3,44,800 కోట్ల స్థాయిలో ఉందని తాజా నివేదికలో తెలిపింది.

Tags

Next Story