ఒక పంతులుకు ఇంత ధైర్యం యాడ్నుంచి వచ్చింది..

ఒక పంతులుకు ఇంత ధైర్యం యాడ్నుంచి వచ్చింది..
నాకూ తెలుసు సర్.. జేడీ ఒక నేరస్ధుడు..

తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. అందుకే అక్కడ హిట్టైన సినిమాలన్నీ ఇక్కడ డబ్ అవుతుంటాయి. ఇక అక్కడ సూపర్‌స్టార్‌లుగా వెలుగుతున్న హీరో హీరోయిన్లకు తెలుగులోనూ మంచి ఫాలోయింగే ఉంది. తాజాగా తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్ర టీజర్‌ను తెలుగులోనూ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులోని డైలాగ్ విజయ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 'అది నాకూ తెలుసు సర్.. జేడీ ఒక నేరస్ధుడు.. ఒక పంతులుకు ఇంత ధైర్యం యాడ్నుంచి వచ్చింది.. అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. 1.30 నిమిషాల నిడివిలో సాగే ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవికా మోహన్ నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. అర్జున్ దాస్, సిమ్రన్, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్, ఎక్స్‌బీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా, నవంబర్ 14న విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికే 45 మిలియన్ల మంది వీక్షించారు. 2 మిలియన్ల మంది లైక్ కొట్టారు. ఇక ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర బృందం చెబుతోంది.

Tags

Next Story