Mecca : కాబాలో భారత్ జోడో యాత్ర జెండా ప్రదర్శించిన వ్యక్తి అరెస్ట్

మక్కాలో 'భారత్ జోడో యాత్ర' జెండాను ప్రదర్శించినందుకుగాను, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సౌదీ అరేబియా పోలీసులు. మధ్యప్రదేశ్ నివారి జిల్లాకు చెందిన రజా ఖాద్రీ (26) మక్కా దర్శించడానికి వెళ్లారు. ఈయన చురుకైన కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఫ్లకర్డును కాబాలో ప్రదర్శించాడు.
సోషల్ మీడియాలో ఖాద్రీ ప్రదర్శించిన ఫోట్ వైరల్ అవడంతో.. సౌదీఅరేబియా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ పవిత్ర స్థలమైన కాబాలో ఏ రకమైన ఇతర జెండాలను ప్రదర్శించడం నిషేధం.
మక్కా రూల్స్ తెలియని పలువురు తరచుగా అక్కడి చట్టాలను మీరుతున్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి మక్కాకు వెళ్లే ప్రయాణికులకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పలువురు అనుకోకుండా అక్కడి చట్టాలను మీరుతున్నారు. హరామ్ ప్రాంతంలో ఏ రకమైన జెండాను ప్రదర్శించడం, నేలమీద ఉన్న వస్తువులను తీసుకురావడం చేయకూడదని భారత అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com