Meghalaya Elections: 26 శాతం పూర్తయిన ఓటింగ్

మేఘాలయాలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 60మంది సభ్యులు గల మేఘాలయ అసెంబ్లీకి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు ముగియనున్నాయి. ఇప్పటివరకు 26.7 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. బరిలో మొత్తం 369 మంది అభ్యర్థులు ఉన్నారు. 60 స్థానాలలో బీజేపీ పోటీచేస్తుంది. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీనుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
ఒకప్పుడు మేఘాలయాలో చిన్నపాటి ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ పాలన సాగించిన కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా తన ఉనికిని చాటడానికి ప్రయత్నిస్తోంది. తృణముల్ కాంగ్రెస్ కూడా అధికార పార్టీని గద్దెదించేందుకు చూస్తోంది. ఎన్నికల ఫలితాలు మార్చి 2న ప్రకటించబడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా పోలింగ్ స్టేషన్ కు చేరుకుని క్యూలో నిలబడి ఓటు వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com