Satya Pal Malik : ప్రధాని మోదీపై మేఘాలయ గవర్నర్ షాకింగ్ కామెంట్స్

Satya Pal Malik : ప్రధాని నరేంద్రమోడీపై షాకింగ్ కామెంట్స్ చేశారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ మాలిక్ ఈ కామెంట్స్ చేశారు. రైతుల ఆందోళనలపై జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ అహంకారంగా ప్రవర్తించారని అన్నారు. ఇదే విషయంపై ప్రధానితో తానూ గొడవకు దిగానన్నారు సత్యపాల్ మాలిక్.
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని మోడీ దృష్టికి తెచ్చానన్నారు సత్యపాల్ మాలిక్. ఐతే మోడీ మాత్రం అహంకారంగా వాళ్లు నా కోసం చనిపోయారా అంటూ ప్రశ్నించారని చెప్పారు సత్యపాల్ మాలిక్. మీరు ప్రధానిగా ఉండగానే రైతులు చనిపోయారని తానూ సమాధానమిచ్చానన్నారు సత్యపాల్ మాలిక్. సత్యపాల్ మాలిక్ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
మంత్రి కేటీఆర్ సైతం ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సాగు చట్టాల విషయంలో రైతులపై నమోదైన కేసుల రద్దు విషయంలో కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలన్నారు సత్యపాల్ మాలిక్. MSPకి చట్టబద్ధత కల్పించే ప్రణాళిక సిద్దం చేయాలని డిమాండ్ చేశారు. రైతు పోరాటం ఆగిపోయిందని భావిస్తే పోరపాటేనన్నారు సత్యాపాల్ మాలిక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com