Meta : రీల్స్ కు ఇక ప్లే బోనస్ లేనట్టే...

Meta : రీల్స్ కు ఇక ప్లే బోనస్ లేనట్టే...
ఇన్స్టా ఇన్ల్ఫుయెన్లర్సకు షాక్... రీల్స్ పై ప్లే బోనస్ లు నిలిపివేసిన మెటా...
సోషల్ మీడియా ద్వారా వేలకు వేలు సంపాదిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయానికి మెటా భారీగా గండికొట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికాలో తమ రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్ ను నిలిపివేస్తూ మెటా ప్రకటన విడుదల చేసింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో క్రియేటర్ల వీడియోలు పలు టార్గెట్ లు ఛేధిస్తే ఈ బోనస్ లు లభించేవి. ఇక వాటినే నమ్ముకుని పూర్తిస్థాయి ఇన్ఫ్యుయెన్సర్లుగా మారిన వారికి ఈ వార్త గట్టి ఝలక్కే ఇచ్చేట్టు కనిపిస్తోంది. అయితే మెటా మాత్రం మానిటైజేషన్ పై దృష్టి పెట్టేందుకే ఈ ప్రోగ్రామ్ ను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. తమ క్రియేటర్లకు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా, అభిమానుల ద్వారా ఆదాయం లభిస్తూనే ఉంటుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story