రేపట్నుంచే మెట్రో పరుగులు.. ఎక్కాలంటే కొన్ని కండిషన్స్..

రేపట్నుంచే మెట్రో పరుగులు.. ఎక్కాలంటే కొన్ని కండిషన్స్..
కరోనా వచ్చి అయిదు నెలలు దాటిపోయింది.. ఇంకా ఎంత కాలం భయపడేది.. జాగ్రత్తలు తీసుకుంటూ కార్యాలయాలకు వెళ్లక తప్పని పరిస్థితి..

ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితం. సకాలంలో గమ్యస్థానాలకు చేర్చే వాహనాలు లేకపోతే చాలా కష్టం.. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అయిదు నిమిషాలకో మెట్రో రైల్ ని తీసుకు వచ్చే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. రద్దీని బట్టి ట్రైన్ సమయంతో మార్పులు చేయడంతో పాటు కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సూచనలు చేశారు.
ప్రయాణీకులు తక్కువ లగేజీతో ప్రయాణం చేయాలి. ఎవరికి వారు శానిటైజ్ వెంట తెచ్చుకోవాలి. టెర్మినల్ స్టేషన్లలో రైలు తలుపులు తెరిచి ఉంటాయి. స్టేషన్లోకి ప్రవేశించిన వెంటనే టెంపరేచర్ చెక్ చేస్తారు. దగ్గు, జలుగు వంటి ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతిస్తారు. రాత్రి సమయాల్లో స్టేషన్లను శానిటైజ్ చేస్తారు. ప్రతి నాలుగు గంటలకు లిప్ట్ బటన్, ఎస్కలేటర్ హ్యాండ్ రైల్స్ ను తరచూ శానిటైజ్ చేస్తుంటారు. స్టేషన్లలోని వాష్ రూమ్ లను క్లీన్ చేయడం, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచడం వంటివి చేస్తారు. మెట్రో ఉద్యోగులకు, భద్రతా సిబ్బందికి శానిటైజర్లు, పిపిఈ కిట్లు ఇస్తారు. మెట్రో కార్డ్, మొబైల్ క్యూ ఆర్ టికెట్ విధానాన్ని ప్రోత్సహిస్తారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

7వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న మెట్రో రైల్ మొదట మియాపూర్ నుంచి ఎల్బీనగర్, 8న నాగోల్ నుంచి రాయదుర్గం, 9 నుంచి జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాల్లో రైళ్లను నడుపుతారు. రైళ్ల సమయాల్లో కూడా మార్పులు చేశారు.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయింత్రం 4 నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే రైలు నడుస్తుందని తెలిపారు. గాంధీ ఆస్పత్రి, భరత్ నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసఫ్ గూడ స్టేషన్లలో మెట్రో ఆగదని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రయాణీకులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ దరించాలి. మాస్క్ మర్చిపోతే స్టేషన్లో కొనుక్కొని పెట్టుకోవచ్చు. మాస్క్ లు అమ్మే స్టాల్స్ కూడా మెట్రో స్టేషన్లలో వెలిశాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోమని మెట్రో ఎండీ ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story