ఢిల్లీలో లాక్ డౌన్ : వలస కార్మికుల సొంతూళ్ల బాట..

ఢిల్లీలో లాక్ డౌన్ : వలస కార్మికుల సొంతూళ్ల బాట..
పనిచేసే చోట పనులు నిలిచిపోయాయి. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు అయిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందస్తుగా సొంతూళ్లకు మేలని డిసైడ్ అయ్యారు.

పనిచేసే చోట పనులు నిలిచిపోయాయి. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు అయిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందస్తుగా సొంతూళ్లకు మేలని డిసైడ్ అయ్యారు వలస కార్మికులు. దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికులు తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో లుథియానా రైల్వేస్టేషన్ సహా బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల వలస కార్మికులు పిల్లలు, పెద్దలు, మహిళలు.. కుటుంబంతో సహా తమ స్వస్థలాలకు వెళ్తున్నారు.

కూటి కోసం.. కూలి కోసం నగరాల బాట పట్టిన వలస కార్మికులు, కూలీ జనాలకు పీడకల లాంటి రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కరోనా దెబ్బకు గతేడాది లాక్‌డౌన్ సమయంలో చిందరవందరైన వలస కార్మికుల జీవితాలు.. వారు పడిన కష్టం ఎవరూ మర్చిపోలేదు. కిలోమీటర్ల మేర పిల్లలు, పెద్దలు కలిసి నడిచి వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. ఇపుడు మరోసారి లాక్‌డౌన్ ప్రకటిస్తుండటంతో వలస కార్మికలు ఈసారి ముందుగానే స్వస్థలాలకు వెళ్లేందుకు నిర్ణయించారు.

మరోవైపు.. నిన్న దేశరాజధాని ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. సొంతూళ్లకు వెళ్లొద్దని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కానీ.. వాస్తవ పరిస్థితులు వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లేలా చేస్తున్నాయి. పనులు లేక పస్తులు ఉండే కంటే సొంతూళ్లకు వెళ్లడమే మంచిదని వలస కార్మికులు అంటున్నారు. లాక్‌డౌన్ పొడిగిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story