రవాణా శాఖ మంత్రికి కరోనా పాజిటివ్

రవాణా శాఖ మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. సామన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని రవాణా శాఖ మంత్రికి కరోనా సోకింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని ఆయన తెలిపారు. ఆదివారం టెస్ట్ రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని, ‌ఐసొలేషన్‌లో ఉండాలని ప్రతాప్ సింగ్ సూచించారు. కాగా రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 78,77కు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story