మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా
X
స్వల్స కరోనా లక్షణాలు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారుందరూ ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని స్వల్స కరోనా లక్షణాలు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 2,78,599 సంఖ్యకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జ్ కాగా.. 1,499 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 7,272 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తాజా నివేదికలో వెల్లడించింది.

Tags

Next Story