Miss Universe 2022: కన్నడ కస్తూరి కీరీటం తెచ్చేనా....!!

మిస్ యునివర్స్ 2022 పోటీల్లో భారత్ తరపున దివితా రాయ్ పాల్గొనబోతుంది. 85 మంది అందాల రాశులతో భారత సౌందర్యం పోటీపడబోతోంది. భారత కాలమానం ప్రకారం జనవరి 15 ఉదయం 6.14 గంటలకు ఈ పోటీలు జరుగనున్నాయి. మిస్ యునివర్స్ 71వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేకు న్యూ ఓర్లీన్స్ వేదికగా మారబోతోంది.
ఇంతకీ దివాతా రాయ్ ఎవరు. ఎక్కడ జన్మించిందో ఇప్పుడు తెలుసుకుందాం...
23 ఏళ్ల దివితా రాయ్ స్వస్థలం కర్ణాటక. 1998 జనవరి 10న మంగళూరులో జన్మించింది. ఇంటర్మీడియట్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకుంది. ముంబైలోని సర్ జె.జె కాలేజ్ ఆఫ్ అర్కిటెక్చర్ లో బీఆర్క్ డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్ పై ఇష్టంతో ఫ్యాషన్ ప్రపంచంలోకి ప్రవేశించింది.
బాలీవుడ్ సినిమా సెట్ డిజైనర్ గా పలు సినిమాలకు పనిచేస్తూ.. మోడలింగ్ చేసేది దివితా రాయ్. దీంతో పాటు వివిధ ఫ్యాషన్ షోల్లోనూ పాల్గొంది. అగస్ట్ 28, 2022న దివా యూనివర్స్ 2022 టైటిల్ ను గెలుచుకుంది. 2021 మిస్ యునివర్స్ హర్నాజ్ సంధు చేతులమీదుగా కిరీటం పొందింది. మిస్ దివా 2021 మిస్ యూనివర్స్ లోనూ పాల్గొంది. హర్నాజ్ సందూ గెలుచుకున్న టైటిల్ పోటీలో... రెండవ రన్నరప్ గా దివిత నిలిచింది.
దివితకు చదువు విలువ కూడా బాగా తెలుసు. ప్రతీ ఒక్కరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో పాటు.. సెప్టెంబర్ 2021లో క్యాన్సర్ చికిత్సను భరించలేని పిల్లల కోసం నిధులను సేకరించి చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ కు అందజేసింది. 2023 జనవరి 14న జరిగే పోటీల్లో కనుక దివితా రాయ్ విజయం సాధిస్తే భారత్ కు కిరీటం ఖాయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com