Mission Vatsalya: అనాథ బాలలకు అండగా 'మిషన్ వాత్సల్య'.. నెలకు రూ.4 వేల సాయం

Mission Vatsalya: మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనాథ బాలల సంక్షేమం కోసం 2009-10 నుండి “మిషన్ వాత్సల్య” పథకాన్ని అమలు చేస్తోంది. మిషన్ వాత్సల్య యొక్క లక్ష్యం భారతదేశంలోని ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించడం. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన 18 ఏళ్లలోపు అనాథ బాలలకు కేంద్ర, రాష్ట్ర సంయుక్త పథకమైన మిషన్ వాత్సల్య కింద నెలకు రూ.4 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ భైర్మన్ కేసలి అప్పారావు వెల్లడించారు. అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథ బాలల గుర్తింపులో ఉపాధ్యాయులు గ్రామ, వార్డు సచివాలయం అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, వాలంటీర్లు భాగస్వాములు కావాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com