జాతీయం

Mizoram Minister R Lalzirlaina : నాకు ఇలాంటివి కొత్తేమి కాదు.. ఆస్పత్రిలో ఫ్లోర్‌ తుడిచిన మంత్రి..!

Mizoram Minister R Lalzirlaina : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న,పెద్ద ,ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతుంది.

Mizoram Minister R Lalzirlaina : నాకు ఇలాంటివి కొత్తేమి కాదు.. ఆస్పత్రిలో ఫ్లోర్‌ తుడిచిన మంత్రి..!
X

Mizoram Minister R Lalzirlaina : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న,పెద్ద ,ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతుంది. ఎన్నికల సమయంలో కనిపించే రాజకీయ నాయకులు ఇలాంటి విపత్కర సమయంలో మాత్రం కంటికి కనిపించడం లేదు. కొందరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు. మిజోరం విద్యుత్ శాఖ మంత్రి అర్. లాల్జిర్లియనా తానో మంత్రిని అనే విషయాన్ని పక్కన పెట్టి ఆసుపత్రి నేలను శుభ్రం చేశారు.

దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై స్పందించిన ఆయన.. నేను ఆస్పత్రిలో నేలను శుభ్రం చేసి వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు.. అది నా ఉద్దేశ్యం కాదు కూడా.. ఇతరులకి అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన.. తాను ఉన్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్ కి ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ గదిని తానే శుభ్రం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

ఇక తాను ఆస్పత్రిలో బాగానే ఉన్నానని వైద్యులు,నర్సులు బాగా చూసుకుంటున్నారని వివరించారు. అయితే ఇలాంటి పనులు తనకు కొత్తేం కాదని అవసరం అనుకున్నప్పుడు ఇలాంటి పనులు తాను చేస్తూనే ఉంటానని మంత్రి వివరించారు. కాగా ఇదే ఆసుపత్రిలో తన భార్య, కుమారుడు కరోనా చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES