Kerala High Court: ఎమ్మెల్యే ఏమైనా ప్రభుత్వ ఉద్యోగా.. సీఎం తీరుపై హైకోర్టు ఆగ్రహం

Kerala High Court: ఎమ్మెల్యే ఏమైనా ప్రభుత్వ ఉద్యోగా.. సీఎం తీరుపై హైకోర్టు ఆగ్రహం
Kerala High Court: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Kerala High Court: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దివంగత ఎమ్మెల్యే కేకే రామచంద్రన్ నాయర్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. 'శాసనసభ్యుడు ప్రభుత్వోద్యోగి కాడు' అని కేరళ హైకోర్టు శుక్రవారం తీర్పుఇచ్చింది. వెంటనే సదరు ఉద్యోగి అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయమని తీర్పు చెప్పింది.

2016 అసెంబ్లీ ఎన్నికలలో చెంగనూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన తర్వాత మొదటిసారి శాసనసభ్యుడైన నాయర్ ఆరోగ్య సమస్యల కారణంగా 2018లో మరణించారు. నాయర్ కుమారుడు ఆర్.ప్రశాంత్‌ను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియమించాలని విజయన్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఎవరూ ఏకీభవించలేదు. దీంతో అనేక వర్గాల నుండి తీవ్ర వ్యతిరేత ఎదురైంది.

పాలక్కాడ్‌కు చెందిన పిటిషనర్, అశోక్ కుమార్ హైకోర్టులో ఈ విషయమై పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి ఎస్. మణికుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ 'ఎమ్మెల్యే ప్రభుత్వోద్యోగి కాదు. వారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు. కేవలం ఐదేళ్లు మాత్రమే వారు పదవిలో ఉంటారు. అందుచేత వారు మరణిస్తే వారికి బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగం వర్తించదు అని చీవాట్లు పెట్టారు. దీంతో ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటూ సీఎం పేషీ నుంచి వచ్చిన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశారు. యాదృచ్ఛికంగా, నాయర్ రుణాలను మాఫీ చేయడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన తర్వాత ఈ తీర్పు వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story