కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మోదీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. హైదరాబాద్ కంపెనీ భారత్‌ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారు. పంజాబ్‌కి చెందిన నర్సు నిషా శర్మ మోదీకి వ్యాక్సిన్ షాట్ వేశారు.

పుదుచ్చేరికి చెందిన నివేదా సాయంతో ఆమె మోదీకి వ్యాక్సిన్ వేశారు. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్ కూడా ఒకటని ప్రధాని అన్నారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని, ఇందుకోసం కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

Tags

Next Story