Mohan Bhagwat : భారత సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై కుట్రలు: మోహన్ భగవత్

Mohan Bhagwat : ఓటీటీ, మొబైల్ కంటెంట్‌లను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్. దేశానికి హానికరమైన విషయాలను చూపించే ఓటీటీ ప్లాట్ ఫాంలకు అడ్డుకట్ట పడాలన్నారు. భారత సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై కుట్రలు జరుగుతున్నాయని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్న మోహన్ భగవత్.. భారత సంస్కృతిపై కొందరు కావాలనే విషం చిమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో ఓ గందరగోళ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకలకు శిక్షణ ఇచ్చి సరిహద్దుల ద్వారా దేశంలోకి పంపిస్తోందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. అలాగే డ్రగ్స్ వాడకం కూడా దేశంలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వంటివి దేశాల ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తాయన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com