అసలే స్టార్ హీరో కూతురు.. అలా ఉంటే ఎలా అని..

అసలే స్టార్ హీరో కూతురు.. అలా ఉంటే ఎలా అని..
వెరసి విస్మయకు ఓ ఫైన్ మార్నింగ్ పెరిగిపోతున్న తన బరువును తగ్గించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.

సినిమాల్లో సీనియర్ నటుడు.. తన నటనకు ప్రేక్షకులు థియేటర్లో చప్పట్లు కొడతారు.. మోహన్‌లాల్ కూతురేంటి ఈ వయసులోనే అంత లావుగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులూ పెడతారు.. అయినా ఓ స్టార్ కూతురై ఉండి బాడీ మీద శ్రద్ధలేకుండా అలా ఎలా ఉందని కామెంట్లూ చేస్తారు.. వెరసి విస్మయకు ఓ ఫైన్ మార్నింగ్ పెరిగిపోతున్న తన బరువును తగ్గించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే ఫిట్‌నెస్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ దగ్గర చేరి కఠినమైన శిక్షణ తీసుకుంది. 22 కిలోల బరువు తగ్గింది.

ఇదే విషయాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది. అప్పుడలా.. ఇప్పుడిలా ఉన్నానంటూ తను బరువు తగ్గడానికి సహకరించిన ఫిట్‌నెస్ ట్రైనర్ గురించి వివరించింది. మార్షల్ ఆర్ట్స్ బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడిందని చెప్పింది. ఇందుకోసం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడ శిక్షణ తీసుకున్నానని పేర్కొంది. ఆరంభంలో నేను చేయగలనో లేదో అనుకున్నాను. కొన్నేళ్ల క్రితం మెట్లు ఎక్కితేనే ఉపిరాడేది కాదు. అలాంటిది ఈ మార్షల్ ఆర్ట్స్ ఎలా చేస్తానో ఏమో అని మొదట్లో కొంచెం సంశయించాను.

కానీ బరువు తగ్గాలని బలంగా ఉండడంతో ఇష్టంగా చేశాను. శిక్షణ ఇచ్చే వారు కూడా మంచి వారు కావడంతో నాకు ఇబ్బంది అనిపించలేదు. దాంతో శిక్షణ పూర్తయ్యే నాటికి 22 కిలోలు బరువు తగ్గాను నా కోచ్ సాయం లేకపోతే నేనిదంతా సాధించేదాన్ని కాదు.. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఇది నేను చేయలేనేమో అని అనుకునేదాన్ని.. కానీ ఆయన.. నేను ఏదైనా చేయగలను అనేలా చేశారు. కేవలం బరువు తగ్గడమే కాకుండా, ఈ శిక్షణ నన్ను ఎన్నో విధాలుగా తీర్చిదిద్దింది అని విస్మయ వివరించారు.

Tags

Next Story