హౌస్‌లో మోనాల్.. వెళ్లిపోయేటప్పుడు ఎంతిచ్చారో తెలుసా!!

హౌస్‌లో మోనాల్.. వెళ్లిపోయేటప్పుడు ఎంతిచ్చారో తెలుసా!!
ఫినాలేకి వారం ఉందనగా టాప్ 5 కంటెస్టెంట్లలో తన పేరు లేదని బిగ్‌బాస్ తనని హౌస్ నుంచి బయటకు పంపించేశారు.

గుజరాతీ భామ మోనాల్ గజ్జర్.. వచ్చీ రాని తెలుగులో 100 రోజులకు దగ్గరగా ఇంట్లో ఉంది. ఇంటి సభ్యులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే మోనాల్ చివర్లో స్ట్రాంగ్ అయ్యానని, ఈ హౌస్ తనకెన్నో నేర్పిందని చెప్పింది. 3,4 వారాలుండి మూటా ముల్లె సర్ధుకుంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు గుజరాతీ అమ్మాయిని బాగానే ఆదరించారు. ఫినాలేకి వారం ఉందనగా టాప్ 5 కంటెస్టెంట్లలో తన పేరు లేదని బిగ్‌బాస్ తనని హౌస్ నుంచి బయటకు పంపించేశారు.

ఇన్ని రోజులు ఇంట్లో ఉండడమే చాలా ఎక్కువ.. ఇప్పటి వరకు ఆదరించిన, ఓట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అంటూ వెళ్లిపోయింది. గుజరాతీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ గజ్జర్‌ను నిజంగా ఇంతకాలం ప్రేక్షకులే సేవ్ చేశారా లేక గ్లామర్ హీరోయిన్ కాబట్టి బిగ్‌బాస్ రక్షిస్తున్నాడేమో అని ఒకానొక సమయంలో అందరికీ డౌట్ వచ్చింది. అయితే 98 రోజులు ఉన్న ఈ భామకు ఎంతిచ్చుంటారో అని ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు.

అందరిలో ఆసక్తిగా మారిన ఆమె రెమ్యునరేషన్ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 30 లక్షల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. రోజుకు 30 వేల పారితోషికం చొప్పున మొత్తం 98 రోజులకు గాను 29 లక్షల 60 వేల రూపాయలు బిగ్‌బాస్ ఇచ్చారు. హౌస్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న లాస్య, అవినాష్ సరసన మోనాల్ కూడా చేరిపోయింది. భారీ పారితోషికంతో పాటు బ్రహ్మాండమైన గుర్తింపు కూడా వచ్చింది. ఈ గుర్తింపుతో గజ్జర్‌కి సినిమాల్లో అవకాశాలు ఎంతవరకు వస్తాయో.

Tags

Next Story