ప్రతినెలా రూ.50 వేలు పెన్షన్ అందుకోవాలంటే..

ప్రతినెలా రూ.50 వేలు పెన్షన్ అందుకోవాలంటే..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్పినట్లుగానే సంపాదన ఉండగానే పొదుపు చేస్తే ముందు జీవితం ఒడిదుడుకులు

ఉద్యోగం చేసినన్నాళ్లు ఉరుకులు పరుగులు, బాధ్యతల బరువు, ఆర్థిక సమస్యలు అన్నింటినీ దాటుకుని రిటైర్మెంట్ కు చేరుకునే సమయంలో ఆ తరువాతి పరిస్థితి ఏంటి ప్రతి ఉద్యోగి ఆలోచన. పదవీ విరమణ అనంతరం బ్రతుకు బండి సాఫీగా సాగాలంటే ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలి. అందుకు ఉద్యోగం చేస్తున్నసమయంలోనే పొదుపు ప్రణాళికను చేపట్టాలి. కొంత మొత్తాన్ని సరైన చోట మదుపు చేయాలి. అప్పుడే మలి వయసులో ప్రశాంతమైన జీవనం గడపడానికి ఆస్కారం ఉంటుంది.

బయటికి అడుగుపెడితే రూ.100లు ఖర్చవడానికి ఒక్క నిమిషం పట్టట్లేదు.. ఖర్చులూ పెరుగుతున్నాయి.. రోజువారీ వినియోగించే వస్తువుల రేట్లూ పెరుగుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్పినట్లుగానే కాస్త సంపాదన ఉండగానే పొదుపు చేస్తే ముందు జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.

ఉద్యోగం వచ్చీ రాగానే కారు, ఇల్లు లాంటివి కొనాలని లోన్ తీసుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకుంటామో అదే మాదిరిగా 30, 35 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ తరువాత వచ్చే పెన్షన్ గురించి కూడా ఆలోచించడం అంతే ముఖ్యం. 55 సంవత్సరాలకి పదవీ విరమణ చేస్తామని అనుకుంటే ఇప్పుడు మీ నెల ఖర్చులకు సుమారు రూ.15,000లు సరిపోతాయని అనుకుందాం. ద్రవ్యోల్బణం సంవత్సరానికి 6 శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా వేసనప్పటికీ 55 ఏళ్ల వయసులో ఆ ఖర్చులు రూ.64,000కి చేరుకుంటాయి. ఒకవేళ ఖర్చులు పెరిగితే అది మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని బట్టి మీరు రూ.64,000 పెన్షన్ కోరుకుంటున్నారు.. పన్ను 20 శాతం కట్టాల్సి ఉంటుంది అనుకుంటే ఏడాదికి సుమారు రూ.9.50 లక్షలు అవసరం ఉంటుంది. అంటే నెలకు రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మరి ఈ పెన్షన్ స్కీమ్ కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..

1. పదవీ విరమణ నిధి కోసం ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) మంచి ఎంపిక. టైర్-1 ఖాతాను తెరిచి, ఇందులో నెలవారీ పెట్టుబడి పెట్టవచ్చు.

2. తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్, నిఫ్టీ ఇండెక్స్ లాంటివి కూడా సరైన ఎంపిక.

రిటైర్మెంట్ కార్పస్ పొందాక..

1. మీరు ఎన్‌పీఎస్‌ లో పెట్టుబడి పెట్టినట్లేతే, 60 ఏళ్లు దాటినప్పుడు మాత్రమే కార్పస్ ను ఉపసంహరించుకోవచ్చు. అందులో 60 శాతం కార్పస్ ను పన్ను రహితంగా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని నెలవారీ పెన్షన్ కోసం మాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. ఆ 60 శాతాన్ని పెన్షన్ రూపంలో పొందడానికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లేదా ఎల్ఐసీ వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు.

2.అంత పెన్షన్ పొందాలంటే మరో ఆప్షన్ పదవీ విరమణ సమయంలో వచ్చే నిధిని 5 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తరువాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లేదా ఎల్ఐసీ వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు.

3.బీమా సంస్థల యాన్యుటీ ప్లాన్ లనుకూడా తీసుకోవచ్చు. కానీ, వివిధ ఛార్జీల కారణంగా రాబడి ఇందులో కొంత తక్కువగా ఉంటుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ కొత్త ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.. సాధ్యమైనంతవరకు రుణాన్ని(అప్పులను) నివారించాలి. గృహరుణం వంటి రుణాల గురించి కూడా ఆలోచించాలి. మీ ఆదాయంలో కనీసం 30 శాతం పెట్టుబడులకు కేటాయిస్తే రుణాలు చెల్లిస్తున్నప్పటికీ ఇబ్బంది ఉండదు. రిటైర్మెంట్ ప్లాన్ గురించిన మరింత సమాచారం కోసం ఫైనాన్స్ ప్లానింగ్ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిది.

Tags

Next Story