Gujarat: విషాదం.. బ్రిడ్జి కూలి బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన 12 మంది మృతి

Gujarat: విషాదం.. బ్రిడ్జి కూలి బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన 12 మంది మృతి
Gujarat: గుజరాత్‌లోని మోర్బి వంతెన కూలిన ఘటనలో పన్నెండు మంది కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Gujarat: గుజరాత్‌లోని మోర్బి వంతెన కూలిన ఘటనలో పన్నెండు మంది కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరంతా రాజ్‌కోట్‌కు చెందిన బిజెపి ఎంపి మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా కుటుంబానికి చెందిన వారు. ఈ విషాద ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. "ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలతో సహా నా కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయాను. నా సోదరి కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులను కోల్పోయాను" అని అన్నారు.


స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతోంది. మచ్చు నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎంపీ అన్నారు. గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై శతాబ్దాల నాటి వేలాడే వంతెన కూలిపోవడంతో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు.

బ్రిడ్జిని తెరవడానికి ఎలా అనుమతి ఇచ్చారని బీజేపీ ఎంపీని ప్రశ్నించగా.. ఈ దుర్ఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతామని, బాధ్యులను శిక్షిస్తామని తెలిపారు. మేము ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాము, ఇది చాలా బాధాకరం, "అని మంత్రి ఆదివారం అన్నారు.



బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మృతులకు, క్షతగాత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వంతెన కూలిపోయింది. దీపావళి సెలవులు, ఆదివారం కావడంతో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన వంతెనపై సందర్శకులు ఎక్కువగా ఉన్నారు. కొన్నేళ్లపాటు నిరుపయోగంగా పడి ఉన్న వంతెనను దాదాపు 7 నెలల నుంచి మరమ్మతులు జరుగుతున్నాయి. అవి పూర్త కావడంతో ఈ నెల 26నే మళ్లీ పున:ప్రారంభమైంది. అంతలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story