దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ల సంఖ్య..

దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ల సంఖ్య..
పిపిఈ కిట్లు ధరించి వైరస్ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేశారు. అయినా ఏ మాత్రం జాలి, దయ లేని కరోనా

తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా రోగులకు సేవలందించారు. కుటుంబాలకు దూరంగా, రోగులకు దగ్గరగా ఉన్నారు. రేయింబవళ్లు విధులు నిర్వర్తించారు. పిపిఈ కిట్లు ధరించి వైరస్ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేశారు. అయినా ఏ మాత్రం జాలి, దయ లేని కరోనా వైద్యులను పొట్టన పెట్టుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 500 మంది వైద్యులు కరోనా కాటుకు బలయ్యారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) శుక్రవారం తెలిపింది. వీరిలో సగం మందికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఐఎంఏ అధ్యక్షుడు రాజన్ శర్మ అన్నారు.

ఐఎంఏ డేటాబేస్ ప్రకారం డాక్టర్ రోగి నిష్పత్తి 1: 194గా ఉంది. మరణించిన వైద్యుల్లో అధికంగా 60 నుంచి 70 సంవత్సరాల వయసు వారు ఉన్నారు. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని అందువల్ల కేంద్రం వద్ద వారి డేటా లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులకు 50 లక్షల భీమా ఉందని, దీన్ని మార్చి 2021 వరకు పొడిగించామని ఆయన తెలిపారు.

Tags

Next Story