అత్త కోపం.. గర్భిణితో ఉన్న కోడలి పై వేడి టీ..

అత్త అమ్మ కాదు.. కోడలు కూతురు కాదు.. కోడలిని సాధించడమే పరమావధిగా పెట్టుకునే అత్తలు కొందరుంటారు.. ఇప్పుడు నేనొచ్చాను కాబట్టి పెత్తనమంతా నాదే అనే కోడళ్లూ ఉన్నారు. ఏదేమైనా సమస్యలుంటాయి.. వాటిని నలుగురూ కూర్చుని పరిష్కరించుకుంటే గొడవలనేవి వుండవు. కొన్ని సార్లు సర్ధుకుపోతేనే అవి గొడవకు దారి తీయకుండా ఉంటాయి.
కోడలు గర్భవతి అని కూడా చూడకుండా ఆమె ఒంటి మీద వేడి టీ గుమ్మరించింది అత్త. అదృష్టం బావుండి చిన్న చిన్న గాయాలతో బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్న కడబూరు గ్రామానికి చెందిన ఎల్లప్ప, ఎల్లమ్మ కుమార్తె గీతకు అదే గ్రామానికి చెందిన బోయ అంజినయ్య, నర్సమ్మ కుమారుడు రామాంజితో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు.
వీరికి ఓ కూతురు ఉంది. ప్రస్తుతం గీత గర్భిణి.. అత్త, మామ, భర్త నిత్యం వేధిస్తున్నారని గీత తెలిపినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం అత్తా కోడళ్లు గొడవపడ్డారు. అత్త కోడలి మీద కోపంతో చేతిలో ఉన్న వేడి టీని కోడలిపై పోయడంతో గీత గాయాలపాలైనట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com