Petrol : మళ్లీ పెట్రో బాంబ్ పడబోతోందా?.. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు

Petrol : అటు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ మేఘాలు.. ఇటు సాయంత్రం ముగియనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దీంతో మళ్లీ పెట్రో బాంబ్ పడబోతోందోనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి.. ఇటు చూస్తే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇవాళ సాయంత్రంతో ముగియనున్నాయి.. దీంతో మరోసారి పెట్రో ధరలు పెంచుతారంటూ ప్రచారం జరుగుతోంది.. దీంతో ముందుగానే వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు జనం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు.. అయితే, బంకుల యజమానులు స్టాక్ లేదంటూ తిప్పి పంపించేస్తుండటంతో వారంతా తలు పట్టుకుంటున్నారు.
పెట్రోల్ రేట్లు పెరుగుతాయన్న ప్రచారం వాహనదారులకు ముందే కష్టాలు తెచ్చిపెట్టింది.. కొన్ని పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.. తూర్పుగోదావరి జిల్లా యానాంలోని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదంటూ వచ్చిన వారిని వచ్చినట్టే తిప్పి పంపించేస్తున్నారు నిర్వాహకులు.. అయితే, కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టకుండానే పెట్రోల్, డీజిల్ లేదని పంపించేస్తున్నారు.. ధరలు పెరిగిన తర్వాత అమ్ముకునేందుకే ఇలా చేస్తున్నారంటూ వాహనదారులు ఫైరవుతున్నారు.. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని, బంకులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com