Shivraj Singh Chouhan : త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్ సీఎం..!

X
File photo
By - TV5 Digital Team |22 Jan 2022 7:10 PM IST
Shivraj Singh Chouhan : Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... కుటుంబ సమేతంగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కలుసుకున్నారు.
Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... కుటుంబ సమేతంగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కలుసుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చౌహాన్ .. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల వద్ద చినజీయర్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎంకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి జీయర్ స్వామిని కలుసుకున్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న శ్రీ రామానుజ జీయర్ సహస్రాబ్ది వేడుకల ఏర్పాట్ల గురించి శివరాజ్ సింగ్ చౌహన్‌కు జీయర్ స్వామిజీ వివరించారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ఆవిష్కరించబోతున్న సమతామూర్తి విగ్రహాన్ని చౌహన్ సందర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com