కొడుకులపై కోపం.. ఆస్తి మొత్తం కుక్క పేర రాసిన కూల్ ఫాదర్

కొడుకులపై కోపం.. ఆస్తి మొత్తం కుక్క పేర రాసిన కూల్ ఫాదర్
అది నాపై చూపించే ప్రేమ ముందు నా కొడుకులు పనిరారు అని అంటున్నారు.

కష్టపడి కొడుకుల్ని పెంచి పెద్ద చేస్తే.. ఆస్తి కోసం అమ్మానాన్నలని చూడకుండా బతికుండగానే నరకం చూపిస్తున్నారు.. ఇలాంటి కొడుకుల్ని ఎందుకు కన్నామా అని ఆవేదన చెందుతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. వాళ్లకీ బిడ్డలు ఉంటున్నారు.. పెద్దైన తరువాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందన్న ఎరుకతో ఎవరూ ఉండడట్లేదు.

బిడ్డల సంపాదన మీద ఆధారపడకపోయినా.. పోయేదాకా ఉండలేకపోతున్నారు.. ఉన్నప్పుడే లాక్కుపోతున్నారు. ఆస్తి ఉంటేనే అంతంత మాత్రంగా ఉన్న బతుకులు.. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే రోడ్డుమీదకి లాగేస్తారని ముసలి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్న వార్తలెన్నో.. అలాంటి పరిస్థితి తనకి ఎదురు కాకూడదని భావించిన ఓ తండ్రి తను ప్రేమగా పెంచుకున్న పెంపుడు శునకానికి ఆస్తి రాసిచ్చాడు.. నా కొడుకులకంటే ఈ కుక్కే నయం అంటున్నాడు.

నేను బాధపడుతున్నానని తెలిస్తే అది అన్నం ముట్టదు. నేను బయటికి వెళ్తే వచ్చిందాకా గుమ్మంలో నాకోసం ఎదురు చూస్తుంటుంది.. అది నాపై చూపించే ప్రేమ ముందు నా కొడుకులు పనిరారు అని అంటున్నారు. తల్లిదండ్రులను చూడని కొడుకులకు ఇది చెంపపెట్టులాంటిది.

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఒక వ్యక్తి తన ఆస్తిని తన పెంపుడు కుక్కకి, రెండవ భార్యకి చెరి సగం రాసి ఇచ్చాడు. కొడుకుల ప్రవర్తనతో నిరాశ చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన ఆస్తిని తన కుక్క జాకీకి ఇచ్చాడు.

రైతు ఓం నారాయణ్ వర్మ తాను పెంచుకుంటున్న కుక్క తన కొడుకుల కంటే ఎక్కువని, దానికున్న విశ్వాసం కన్న కొడుకులకు లేదని అందుకే తన ఆస్తిలో సగం కుక్క జాకీకి ఇస్తున్నానని పేర్కొన్నాడు.

తన ఆస్తిలో మిగిలిన సగం తన రెండవ భార్య చంపాకు ఇచ్చాడు. 50 ఏళ్ల రైతుకు మొత్తం 18 ఎకరాల భూమి ఉంది. నా భార్య, నా పెంపుడు కుక్క నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాయి.

అందువల్ల నేను వారికి అత్యంత సన్నిహితుడిని. నేను చనిపోయిన తరువాత, నా రెండవ భార్య చంపా, పెంపుడు కుక్క జాకీ నా వద్ద ఉన్న ఆస్తి అంతా వారసత్వంగా పొందాలని నేను కోరుకుంటున్నాను. కుక్కను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి నేను దాని కోసం కేటాయించిన ఆస్తిని వారసత్వంగా పొందుతాడు"

నారాయణ్‌కు మొదటి భార్య ధన్వంతి వర్మ ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండవ భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags

Next Story