Jharkhand: పంచాయితీ ఎలక్షన్ డ్యూటీలో ఎం.ఎస్.ధోని .. : షాక్ లో పబ్లిక్

Jharkhand: భారత జట్టు మాజీ కెప్టెన్, రాంచీ యువరాజు మహేంద్ర సింగ్ ధోనీ తన నగరం రాంచీలో ఉన్నాడా. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని అక్కడ డ్యూటీ చేస్తున్నాడా. మరి ఐపీఎల్ సంగతేంటి.
ఈ ఫోటో చూస్తే సరిగ్గా అలానే అనిపిస్తుంది. ఇక్కడ కూడా ధోనీ హెడ్‌లైన్స్‌లో ఉన్నాడు. అది కూడా 'ఎలక్షన్ డ్యూటీ' లో. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో బిజీగా ఉంటే, పంచాయతీ ఎన్నికల్లో అతనెలా ఉంటాడు అని ఆలోచిస్తున్నారు కదూ.
దానికి సమాధానం.. ధోనిలా ఉన్న వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజధాని రాంచీకి ఆనుకుని ఉన్న సిల్లిలోని లోటా పంచాయతీలో ఎన్నికలు నిర్వహిస్తున్న వ్యక్తి అచ్చం ధోనీలా ఉన్నాడని ప్రజలు అతని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దాంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.
జార్ఖండ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న ఆ అధికారి పేరు వివేక్ కుమార్. ఫోటోలు చూస్తే అచ్చంగా అలానే ఉన్నాడనుకుంటారు. నాలుగు రోజుల క్రితం, సిల్లి బ్లాక్‌లోని లోటా పంచాయతీలో మహేంద్ర సింగ్ ధోని పంచాయతీ ఎన్నికలలో నిమగ్నమై ఉన్నారనే వార్తలు వ్యాపించాయి. ఈ 'ధోని'ని చూసేందుకు సిల్లీతో పాటు రాంచీ నుంచి కూడా చాలా మంది వచ్చారు.
కానీ ఇవేం పట్టనట్టు వివేక తన పని తాను నిమగ్నమయ్యారు. తల వంచుకుని పని చేసుకుంటున్నారు.. ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నామని కొంచెం ఫీలయ్యారు. కొద్ది సేపటికి ముఖం పైకెత్తగానే జనం ఆశ్చర్యపోయారు. అచ్చంగా ధోనీలానే ఉండే ఈ వ్యక్తి వివేక్ కుమార్. జనం ముఖాల్లోని ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ పంచాయితీ డ్యూటీలో తన పనిలో మునిగిపోయాడు.
నిజానికి, వివేక్ కుమార్ లుక్, అతని హెయిర్ స్టైల్, ముఖ నిర్మాణం అంతా మహేంద్ర సింగ్ ధోనీని పోలి ఉన్నాయి. దీంతో ప్రజలు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటే ఇదేనేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com