Mukesh Ambani: జెడ్ ప్లస్ సెక్యూరిటీకి సుప్రీమ్ కోర్ట్ ఆమోదం

X
By - Chitralekha |1 March 2023 5:31 PM IST
అపరకుబేరుడికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ; ఇక్కడే కాదు విదేశాల్లోనూ భధ్రత ఇవ్వాల్సిందే; ఖర్చులు మాత్రం అంబానీవే....
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలోనూ, విదేశీ పర్యటనల్లోనూ ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ మేరకు ఖర్చులన్నీ ముఖేశ్ అంబానీనే భరించాల్సిందిగా స్పష్టం చేసింది. జస్టిస్ కృష్ణ మురారి, అశనుద్దీ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పును వెలువరించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మహారాష్ట్ర హోం శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేసింది. అయితే విదేశీ పర్యటనల్లో సెక్యూరిటీ కవర్ మాత్రమే లభిస్తుందని స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com