Mukesh Ambani: 15 నెలలకే స్కూల్ కి.. అంబానీ మనవడా మజాకా!!

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ అప్పుడే స్కూలుకు వెళ్లే వయసుకు చేరుకున్నాడు. మంగళవారం, ముంబైలోని నర్సరీ స్కూల్‌లో అడుగుపెట్టాడు. ముఖేష్ అంబానీ మనవడు మొదటిసారి బయటకు రావడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. 15 నెలల వయసున్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు - శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలు ఎత్తుకుని తీసుకు వచ్చారు.
దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన పృథ్వీ మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌కు పంపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. చిన్నారి తల్లిదండ్రులు కూడా అదే పాఠశాలలో చదువుకున్నారు.
పృథ్వీ తల్లిదండ్రులు తమ కుమారునికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని కోరుకున్నారు. అయితే అదే సమయంలో నాణ్యమైన విద్యను అందించే పాఠశాలను గురించి ఎంక్వైరీ చేసి చివరకు శ్లోక, ఆకాష్ చదువుకున్న స్కూల్లోనే జాయిన్ చేశారు.
ప్రత్యేక సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పృథ్వీ స్కూలుకు వచ్చాడు. వచ్చిన మొదటి రోజే తోటి పిల్లలతో కలిసి పోయి ఆడుకున్నాడు. పృథ్వీ 'సాధారణ' జీవితాన్ని గడపాలని ముఖేష్ కుటుంబం కోరుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com