Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో పలు వైష్ణవ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వనపర్తిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు..


అటు వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వార భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అంతకుముందు.. ఆలయ అర్చకులు అధికారులు ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి.. భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వార్లకి మహా హారతి అనంతరం కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు.


ఇక కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి..శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు.. అటు కోనసీమ జిల్లా ముమ్మడి వరంలోనూ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.. శ్రీదేవి, భూదేవి సమేత కేశవ స్వామి,పల్లేపాలేం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్ధానానికి భక్తుల పోటెత్తారు..


అటు ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.. తిరుమల దత్తత దేవాలం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరగం వైభవంగా జరుగుతున్నాయి.. ఇటు కాకినాడ జిల్లా పెద్దాపురంలోనూ శ్రీ శృంగార వల్లభ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..

Tags

Read MoreRead Less
Next Story