సమ్మర్‌లో అవినాష్ పెళ్లంట.. పెళ్లి కూతురు..!!

సమ్మర్‌లో అవినాష్ పెళ్లంట.. పెళ్లి కూతురు..!!
ఒక్కోసారి తానో కామెడీ యాక్టర్‌ని అన్న విషయం మరిచిపోయి ఏడుస్తూ ఏడిపించాడు. అరుస్తూ రచ్చ కూడా చేశాడు.

ఓ స్టార్ కమెడియన్‌కి ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి ముక్కు అవినాష్. జబర్థస్త్ షో ద్వారా పాపులర్ అయ్యాడు. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ తన సరదా తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 4లో కనిపించి మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన కామెడీతో హౌస్‌లోని సభ్యులను, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఒక్కోసారి తానో కామెడీ యాక్టర్‌ని అన్న విషయం మరిచిపోయి ఏడుస్తూ ఏడిపించాడు. అరుస్తూ రచ్చ కూడా చేశాడు.

అవినాష్‌లో అన్ని కోణాలు సమపాళ్లలో ఉన్నాయని నిరూపించాడు.. ఇక అరియానాతో నడిపిన లవ్ ట్రాక్‌ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అని ఒకానొక సందర్భంలో ప్రేక్షకులకు కల్పించాడు. కానీ అరియానా ఫుల్‌క్లారిటీతో ఉన్నట్లు మాట్లాడింది.. పెళ్లికి వేరే వాళ్లు ఉన్నారు ఇది జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. హౌస్‌లో అవినాష్ పెళ్లి విషయం ఓ హాట్ టాపిగ్గా మారింది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చిన ప్రతిసారి అవినాష్ పెళ్లి ప్రస్తావన ఉండేది.

ఆ పాయింట్ మీద మాట్లాడుతూ నాగార్జున అందర్నీ నవ్వించేవారు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చాక అవినాష్ తాను సమ్మర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. జనవరి 7 తరువాత 4 నెలల పాటు ముహూర్తాలు లేవు కాబట్టి మే నెలలో అవినాష్ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఉండవచ్చని అందుకే అలా చెప్పాడని తెలుస్తోంది. అభిమానులు మాత్రం అరియానానే పెళ్లి కూతురు కావచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై అవినాష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాగా, అవినాష్ అరియానాలతో స్టార్ మా ఛానెల్ ఒక కామెడీ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story