జమ్మూ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు..!

జమ్మూ ఎయిర్‌పోర్టును భారీ పేలుడు వణికించింది. ఉదయం భారీ పేలుడు శబ్ధం వినిపించడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు, అధికారులు పరుగులు పెట్టారు. బాంబు పేలిందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి.
ఎయిర్‌పోర్టులో పేలుడు శబ్ధం వినిపించడంతో.. ఎయిర్‌పోర్టుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ముమ్మత తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేస్తోంది.
ఇక తాజాగా జమ్ము ఎయిర్‌పోర్ట్‌లో ఉగ్రవాదుల భారీ విధ్వంస కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి, 5 కేజీల ఐఈడీ బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ పరిధిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో జమ్ముకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రయాణికుల వివరాలు సేకరించిన తర్వాతే ఎయిర్‌పోర్టు లోపలికి అనుమతిస్తున్నారు.
జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్న తరుణంలో... ఉగ్రకుట్ర తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం నాడు జమ్ములోని పలు పార్టీల నేతలతో ప్రధాని మోడీ సమావేశమై... అసెంబ్లీ ఎన్నికలపై చర్చించి, అభిప్రాయాలు సేకరించారు. ఈ తరుణంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com