Mumbai: అంబానీ ఇంట కన్నులపండుగ; కవలలతో ఇంటికి వచ్చిన ఈషా
Mumbai

Mumbai: అంబానీ ఇంట కన్నులపండుగ; కవలలతో ఇంటికి వచ్చిన ఈషా
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. నవంబర్ 19న ఇషా కవలలకు జన్మనివ్వగా, వారికి ఆదియా, కృష్ణగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రసవానంతరం భారత్ కు విచ్చేసిన ఈషా దంపతులు ఈరోజే ముంబైలో ఉన్న తమ సొంత ఇంటికి మొదటిసారి చేరుకున్నారు.
ఇషా అంబానీ-ఆనంద్ పిరమళ్ తల్లిదండ్రులయ్యాక ఇంటికి రావడం ఇదే తొలిసారి కావడంతో అంబానీ కుటుంబం వారికి ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లే చేసింది. కూతురు అల్లుడితో పాటూ మనుమలను రిసీవ్ చేసుకోవడానికి ముఖేశ్, నీతా అంబానీతో పాటూ మేనమామలు ఆకాష్, అనంత్ కూడా విచ్చేశారు. ఇక ఆనంద్ తల్లిదండ్రుల ఆనందానికైతే అవధులే లేకుండా పోయాయి.అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తుండగా చిన్నారులు విచ్చేసే సరికి వారి సంతోషం రెట్టింపు అయిందనే చెప్పాలి.
ఇషా, ఆనంద్ చిన్నారులతో ఎయిర్ పోర్ట్ నుంచి తమ సొంత ఇంటికి చేరుకోగా ధూమ్ ధామ్ గా మేళతాళాలతో అంగరంగవైభవంగా ఈ జంటను స్వాగతించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్, పోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు తాతైన ముఖేష్ అంబానీ మనవడు- మనవరాలిని చూసి తెగ మురిసిపోతున్నారనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com