Mumbai: ఉర్ఫీపై కేసు...

అర్ధనగ్న ప్రదర్శనతో గ్లామర్ ఫీల్డ్ లో తనకంటూ ఓ స్థానాన్ని కైవసం చేసుకున్న ఉర్ఫీ జావెద్ కు క్రమంగా తన చేతల తాలుకూ సెగలు తనకే తగులుతున్నాయి. ఇప్పటికే అమ్మడిపై గుర్రుగా ఉన్న సంప్రదాయవాదులు ఏ రకంగా ఆమెను జోరుకు కళ్లెం వేయాలా అని ఆలోచిస్తుంటే... భాజాపా నేతలు ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు.
వస్త్రధారణలో విపరీత పోకడలకు పోయే ఈ చిన్నది... పబ్లిక్ ఈవెంట్లకు కూాడా అరకొర దుస్తుల్లో వచ్చి దర్శనమివ్వడం కొంతమందికి మింగుడుపడని విషయంగా మారింది. ఆమె తీరుపై ఇప్పటి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమ్మడి పైత్యం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదని భావించిన భాజాపా ఎమ్మెల్యే చిత్రా వాఘ్ ఆమె జనాల మధ్య అర్ధనగ్నంగా తిరుగుతోందన్న ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమెను ప్రశ్నించేందుకు అంబోలి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ప్రస్తుతానికి ఆమెపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com