Mumbai: బాహు భలే "లిఫ్ట్"

షాపింగ్ మాల్స్, ఆఫీసుల్లోని లిఫ్ట్‌లో ఓ పది లేదా 20 మంది ఎక్కే వీలుంటుంది. కానీ ఏకంగా 200 మంది ఎక్కే లిఫ్ట్‌ను చూశారా? ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్‌గా గుర్తింపు పొందిన ఈ లిఫ్ట్... ముంబైలో ఉంది. జియో వరల్డ్ సెంటర్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎలివేటర్, ఎస్కలేటర్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన KONE ఎలివేటర్స్ ఇండియా దీన్ని నిర్మించింది. ఈ లిఫ్ట్ సామర్థ్యం దాదాపు 200 మంది. 5 స్టాపులు, 16 టన్నుల బరువు, 25.78 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎలివేటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎలివేటర్.
ఈ ఎలివేటర్‌కు సరైన భద్రత కోసం 18 పుల్లీలు, 9 ఐరన్ తాళ్లను వినియోగించారు. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్నారు. ఇది సెకనుకు ఒక మీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. దీనికున్న ప్రత్యేక ఫీచర్లలో గ్లాస్ వాల్, 4-ప్యానెల్ సెంటర్ ఓపెనింగ్ గ్లాస్ డోర్ ఉన్నాయి. అద్భుతమైన ఇంటీరియర్‌తో ఈ లిఫ్ట్‌ను అందంగా తీర్చిదిద్దారు. బటన్ ప్యానెళ్లు, రెండు డిస్ప్లే స్క్రీన్లు ఇందులో ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముంబైలో.... 18.5 ఎకరాల్లో ప్రారంభించిన జియో వరల్డ్ సెంటర్‌కు ఈ భారీ ఎలివేటర్ ప్రత్యేకతను ఈ ఎలివేటర్ ధరను వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది. జియో వరల్డ్ సెంటర్లో మొత్తం 188 ఎలివేటర్లు, ఎస్కలేటర్ల నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com