Mumbai: ఉరకలెత్తిన ఉత్సాహం... పోలీసు లాఠీ పనితనం..

ముంబై వీధుల్లో యువకుల అత్యుత్సాహానికి పోలీసులు చక్కని బహుమతి ఇచ్చారు. ఇద్దరమ్మాయిలతో కలసి అర్థరాత్రి నడిరోడ్డుపై స్టంట్లు వేసిన యువకుడిని ఫయాజ్ ఖాద్రీగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పరిధిలో ఫయాజ్ ఖాద్రి వారం రోజుల క్రితం ఓ వీడియో కోసం నడిరోడ్డుపై స్టంట్లు వేశాడు. ద్విచక్రవాహనంపై ముందరొక అమ్మాయి, వెనుక మరో అమ్మాయిని వేసుకుని ముందర చక్రాన్ని గాల్లోకి లేపి అత్యంత ప్రమాదరకర పరిస్థితిలో బండి నడిపాడు. ముగ్గురిలో ఎవరూ హెల్మెట్ ధరించకపోవడం మరింత విస్తుగొలుపుతోంది. 13 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఓ సామాజిక కార్యకర్త ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ఈమేరకు వీడియోలో ఉన్నవారి గురించి సమాచారమివ్వాల్సిందిగా పోలీసులు కోరారు. చిరవకు ఫయాజ్ ఖాద్రీని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ప్రకటన విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com