Mumbai Marathon: బంగారు బామ్మ...

Mumbai Marathon: బంగారు బామ్మ...
ముంబై మారథాన్ లో పాల్కొన్న 80ఏళ్ల బామ్మ; 51నిమిషాల్లో 4.2 కిలోమీటర్లు పరిగెత్తిన బామ్మ...

ఇటీవలే ముంబైలో జరిగిన టాటా మారథాన్ వైభవంగా ముగిసింది. అయితే ఈసారి అన్ని వయస్కుల వారూ ఈ మారథాన్ లో పాల్గొనడం నిర్వాహకులనే ఆశ్చర్య పరచింది. చిన్నారులు మొదలుకుని, టీనేజర్లు, దివ్యాంగులు, వృద్ధులు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే సుమారు 55వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓ బామ్మ మాత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంది.


ముంబైకి చెందిన 80ఏళ్ల భారతి నిండైన చీరకట్టులో, స్పోర్ట్ షూస్ వేసుకుని, చేతిలో జాతీయ జెండాతో అలుపన్నదే లేకుండా పరిగెత్తారు. సుమారు 51నిమిషాల్లో 4.2 కిలోమీటర్లు నిర్వీరామంగా పరిగెత్తిన బామ్మ.. విజయవంతంగా మారథాన్ ను పూర్తి చేశారు.


బామ్మ మారథాన్ లో పరిగెత్తుతున్న వీడియోను ఆమె మనవరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇక వీడియోలో ఓ చిన్న ఇంటర్వ్యూ కూడా ఉండటం విశేషం.


ఈ మారథాన్ కోసం కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఈ బామ్మ. జాతీయ జెండాను కట్టుకుని పరిగెత్తడం వెనుక కారణం అడగ్గా... తాను భారతీయురాలు అయినందుకు ఎంతో గర్విస్తానని అందుకే, జాతీయ జెండాతో సహా పరిగెత్తినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు.. యువత తమ ఆరోగ్యం కోసం పరుగెత్తాలని సూచించింది ఈ బంగారు బామ్మ... నిజమే మరి... బామ్మ మాటే బంగారు బాట.


Tags

Next Story