దాబాలో కరోనా.. 65 మంది సిబ్బందికి..

దాబాలో కరోనా.. 65 మంది సిబ్బందికి..
ఇది ముఖ్యంగా యువతకు ఇష్టమైన ప్రదేశం, అర్ధరాత్రి కూడా కస్టమర్లతో సందడిగా ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీలోని ముర్తాల్‌లో ఉన్న ప్రసిద్ధ అమ్రిక్ సుఖ్‌దేవ్ దాబాలో కనీసం 65 మంది సిబ్బంది కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అమ్రిక్ సుఖ్‌దేవ్ దాబా (రెస్టారెంట్) ముఖ్యంగా ఉత్తర భారతీయ వంటకాలైన పారాథాస్, కోల్ భాతుర్, కేజర్ టీ, తదితర వస్తువులకు ప్రసిద్ధి చెందింది. ఇది ముఖ్యంగా యువతకు ఇష్టమైన ప్రదేశం, అర్ధరాత్రి కూడా కస్టమర్లతో సందడిగా ఉంటుంది. సాధారణ ట్రాఫిక్ సమయంలో దాబా శివార్లలో ఉన్నందున ఢిల్లీ నుండి ముర్తాల్ చేరుకోవడానికి 1 గంట సమయం పడుతుంది.

అమ్రిక్ సుఖ్‌దేవ్ దాబాలో 60 మందికి పైగా సిబ్బందికి పాజిటివ్ అని తెలిసిన తరువాత, రెండు రోజుల నుంచి మూసివేసి శానిటైజ్ చేస్తున్నారు. ఇతర సిబ్బంది నమూనాలను పరీక్షలకు పంపారు. ఈ దాబాలో దాదాపు 350 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా దాబా ఉన్న ప్రాంతాన్ని కంటైన్ మెంట్ ప్రాంతంగా ప్రకటించినట్లు సోనిపట్ జిల్లా అధికారి శ్యామ్ లాల్ పునియా వెల్లడించారు. అదే ప్రాంతంలో ఉన్న మరో దాబాలో ఉన్న సిబ్బందిని పరీక్షించగా 10 మందికి కరోనా సోకినట్లు తేలింది. అయితే దాబాకు వచ్చే వేల మందిని గుర్తించడం పెద్ద తలనొప్పిగా మారిందని అధికారులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story