PM Modi: నూరవ వసంతంలోకి అడుగుపెట్టిన మాతృమూర్తికి ప్రధాని వందనం..

PM Modi: నూరవ వసంతంలోకి అడుగుపెట్టిన మాతృమూర్తికి ప్రధాని వందనం..
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన తల్లి హీరాబెన్ మోదీ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు.

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన తల్లి హీరాబెన్ మోదీ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు. ప్రధాని తన తల్లి ఆశీస్సులు కోరుతూ ఆమె కాళ్లు కడిగారు. జూన్ 18, 1923న జన్మించిన హీరాబెన్ మోదీ ఈరోజు 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

అనంతరం ప్రధాని మోదీ తన తల్లికి భావోద్వేగంతో లేఖ రాశారు. "మా...ఇవి కేవలం పదాలు కాదు. ఇవి నాలో కలిగిన అనేక భావోద్వేగాల సంగ్రాహం. ఈ రోజు, జూన్ 18 నా తల్లి హీరాబా తన 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ ప్రత్యేక రోజున, నేను సంతోషం మరియు కృతజ్ఞతలను తెలియజేస్తూ కొన్ని ఆలోచనలను రాశాను," ప్రధాని మోదీ తన బ్లాగ్ లింక్‌ను షేర్ చేస్తూ ట్విట్టర్‌లో రాశారు.

ఈ రోజు, నా తల్లితో ఆ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. హీరాబా తన వందో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఇది ఆమె జన్మ శత జయంతి సంవత్సరం. మా నాన్న బతికి ఉంటే గత వారం ఆయన కూడా 100వ పుట్టినరోజు జరుపుకునేవారు. మా అమ్మకు నూరేళ్లు నిండినందున 2022 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. మా నాన్నగారు బ్రతికి ఉంటే ఆయన కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసి ఉండేవారు" అని ప్రధాని తన లేఖలో రాశారు.

గుజరాత్‌లో ఒక రోజు పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ వడోదర ర్యాలీలో ప్రసంగించే ముందు పావగఢ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయన తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని స్వస్థలం వాద్‌నగర్‌లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారు. మోడీ కుటుంబం అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయంలో సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు చేసింది.

హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా మార్చిలో తన తల్లిని సందర్శించారు.

అమ్మ నేర్పిన జీవిత పాఠం..

చదువు లేకపోయినా ఎలా జీవించవచ్చో తెలిపింది. ఒకసారి నాకు చదువు చెప్పిన టీచర్లందరినీ ఆహ్వానించి సన్మానించాలనుకున్నా.. నా మొదటి గురువు అమ్మే అని ఆమెని సన్మానించాలనుకుంటే ఆమె దానిని సున్నితంగా తిరస్కరించారు. తన బదులు నాకు చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన స్థానిక టీచర్ ఒకరిని గౌరవించమని చెప్పారు. ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టి నన్నెప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి అని మోదీ రాసుకొచ్చారు.

చిన్న తనంలో తన తల్లి పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఎదుటివారి సంతోషంలోనే అమ్మ ఆనందం వెతుక్కుంటుంది. మా అమ్మ అనే కాదు.. ఏ మహిళను చూసినా నాకు ఒక్కటే అనిపిస్తుంది. భారత మహిళలు సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు.. అన్నింటినీ స్వీకరించి ముందుకు సాగుతుంది మాతృమూర్తి అని మోదీ ముగించారు.

Tags

Read MoreRead Less
Next Story