నా భార్య పద్మ వల్లే నిహారిక.. : నాగబాబు

నా భార్య పద్మ వల్లే నిహారిక.. : నాగబాబు
X
నూతన వధూవరులకు సంబంధించి ప్రతి వేడుకను ఫోటోల్లో బంధించిన నాగబాబు

ప్రతి తండ్రి ఎదిగిన తన కూతురుకి చక్కటి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటారు.. నేను కూడా అలాంటి కలలుగన్న ఓ సాధారణ తండ్రినే. అయితే ఆ కలలు సాకరమయ్యేందుకు నా భార్య పద్మ సహకారం ఎంతో ఉంది. ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతుడిని. ఈ శుభకార్యాన్ని అత్యంత సులభంగా పూర్తి చేయడంలో ఆమె నాకు అన్ని విధాలుగా సహకరించింది అని నాగబాబు ట్వీట్ చేశారు.

మెగా కుటుంబసభ్యుల నడుమ కూతురిపెళ్లిని ఘనంగా నిర్వహించారు నాగబాబు.. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన మెగా అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు. నూతన వధూవరులకు సంబంధించి ప్రతి వేడుకను ఫోటోల్లో బంధించిన నాగబాబు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కూతురి వివాహ వేడుకను నిర్విగ్నంగా పూర్తి చేయడంలో తన భార్య అందించిన సహకారం మరువలేనిదంటూ ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేశారు. కాగా, వివాహబంధంతో ఒక్కటైన 'నిశ్చయ్' లకు మెగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు అందిస్తున్నారు.

Tags

Next Story