నటుడు నాగార్జునకు అరుదైన గౌరవం

అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డులను నూతన సంవత్సర సందర్భంగా 2021 జనవరి 1 న ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల్లో పలువురి ప్రముఖులకు ఈ అవార్డులు లభించాయి.
టాలీవుడ్ నుంచి నాగార్జున, కోలీవుడ్ నుంచి అజిత్, మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్‌వుడ్ నుంచి శివరాజ్ కుమార్‌లకు.. మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్‌గా 'దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2020' అవార్డు వరించింది.
ఉత్తమ చిత్రంగా నానీ నటించిన జెర్సీ, ఉత్తమ నటుడిగా నవీన్ పోలిశెట్టి (ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ), ఉత్తమ హీరోయిన్‌గా రష్మిక (డియర్ కామ్రేడ్), ఉత్తమ దర్శకుడిగా సుజిత్ (సాహో), ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020 విజేతలు వీరే:
తెలుగు:
మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్ : అక్కినేని నాగార్జున
ఉత్తమ నటుడు : నవీన్ పోలిశెట్టి
ఉత్తమ నటి : రష్మిక మందన
ఉత్తమ దర్శకుడు : సాహో సుజీత్
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
తమిళం:
మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్ : అజిత్ కుమార్
ఉత్తమ నటుడు : ధనుష్
ఉత్తమ నటి : జ్యోతిక
ఉత్తమ దర్శకుడు : పార్థిబాన్
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : అనురుద్ద్ రవిచంద్రన్
మలయాళం:
మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్ : మోహన్ లాల్
ఉత్తమ నటుడు : సూరజ్ వెంజరమూడు
ఉత్తమ నటి : పార్వతీ తిరువోతు
ఉత్తమ దర్శకుడు : మధు కె. నారాయణ్
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : దీపక్ దేవ్
కన్నడ:
మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్ : శివరాజ్‌కుమార్
ఉత్తమ నటుడు : రక్షిత్ శెట్టి
ఉత్తమ నటి : తాన్య హోప్
ఉత్తమ దర్శకుడు : రమేష్ ఇందిరా
ఉత్తమ చిత్రం : మూకాజ్జియ కనసుగలు
ఉత్తమ సంగీత దర్శకుడు : వి. హరికృష్ణ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com