బిగ్‌బాస్ సీజన్ 4 కథ వేరుంటది.. అర్థరాత్రి అయినా ఆదరిస్తున్న ప్రేక్షకులు : నాగార్జున

బిగ్‌బాస్ సీజన్ 4 కథ వేరుంటది.. అర్థరాత్రి అయినా ఆదరిస్తున్న ప్రేక్షకులు : నాగార్జున
ఇంత మంది ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నారు. వారిని మరింత ఎంటర్‌టైన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని రేటింగ్ లెక్కలు

వార్తలు వినాలే తల్లి.. బయట ఏం జరుగుతోందో తెలియకపోతే ఎలా.. కాస్త రిమోట్ ఇవ్వు. అవసర్లేదు బిగ్‌బాస్ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకో.. అంతమంది వ్యక్తులు ఒకే ఇంట్లో అన్ని రోజులు.. అది కదా ఛాలెంజ్.. బిగ్‌బాస్‌ని ఆదరించే తెలుగు ప్రేక్షకుల ఇంట్లో రోజూ ఉండే బాగోతం ఇది. నాగార్జున హోస్టింగ్‌‌తో బిగ్‌బాస్ వీకెండ్స్ మరింతగా ఆకట్టుకుంటోంది ప్రేక్షకులను. అందుకే ఆయన వచ్చిన ప్రతిసారీ.. బిగ్‌బాస్‌కి ఆదరణ పెరుగుతోంది.. ఇంత మంది ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నారు. వారిని మరింత ఎంటర్‌టైన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని రేటింగ్ లెక్కలు చెబుతున్నారు నాగార్జున. కావొచ్చు.. కరోనా సీజన్‌లో మొదలైన బిగ్‌బాస్ 4 మరో రెండు వారాల్లో పూర్తవుతుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లోకి వెళ్లిన 19 మందిలో 13 మంది ఎలిమినేట్ కాగా ఇప్పుడు ఆరుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరంతా టైటిల్ కోసం పోరాడుతున్నారు. ఒకరి మధ్య ఒకరికి బాండింగ్ గట్టిగా పెంచుకున్నారు. బిగ్‌బాస్ విన్నర్ టైటిల్ ఎవరికి వస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మొదట్లో కాస్త చప్పగా సాగినా శని, ఆదివారాల్లో వస్తున్న నాగార్జున వారికి కాస్త క్లాసు పీకుతూ, మరింత బూస్ట్ అందిస్తూ మొత్తానికి వారిని స్ట్రాంగ్ కంటెస్టులుగా తయారు చేశారు. అందుకే హౌస్‌లోని సభ్యులు సైతం ఆ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుందంటారు.

టీఆర్‌పీ రేట్లు భారీగా పెంచిన బిగ్‌బాస్ సీజన్ 4 గత రికార్డులను తుడిచి పెట్టింది. అలాగే జాతీయస్థాయిలో బిగ్‌బాస్ సీజన్ 3 సృష్టించిన రికార్డులను కూడా ఈ సీజన్ బ్రేక్ చేసింది. గతవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల మందికి పైగా బిగ్‌బాస్‌ని వీక్షించారని షో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 12 వారాలలో రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 83% మంది బిగ్‌బాస్‌ని వీక్షించారంటే షో పట్ల ప్రేక్షకులు ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో తెలుస్తోంది. గ్రాండ్ ఫినాలేని మరింత ఆసక్తిగా మలిచేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నాగార్జున.

ప్రతి వారం ఆకట్టుకునే ప్రదర్శనతో 4 జీఈసీలలో 42% వాటా (ఎస్‌డీ+హెచ్‌డీ)ని పొందింది. బిగ్‌బాస్‌ లాంటి షోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో ప్రైమ్‌టైమ్‌పై పాగావేసింది. ప్రేక్షకులను ఆకట్టుకునే మరిన్ని కొత్త కార్యక్రమాలకు చోటు కల్పించింది ఆ సమయంలో. ఎలాగూ బిగ్‌బాస్ షో చూస్తున్న ప్రేక్షకులు ఎక్కడకూ వెళ్లరని భావించి షో టైమ్‌ని 9.30 నుంచి 10గంటలకు మార్చింది. ఆ సమయంలో 'వదినమ్మ' సీరియల్‌కు చోటు కల్పించింది. ఇక రాత్రి 11 గంటల వరకు సాగే బిగ్‌బాస్ ముచ్చట్లతో రోజు ముగిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

Tags

Next Story