బిగ్‌బాస్ 4.. అర్థం కాని టాస్క్‌లు.. ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్న ప్రేక్షకులు

X
By - prasanna |30 Sept 2020 10:47 AM IST
ఆమెకి తోడు అభిజిత్. హౌస్ లో ఎక్కడ చూసినా ఇద్దరూ కనిపిస్తుంటారు..
అంతగా ఆసక్తి కలిగించని బిగ్‌బాస్ 4 హౌస్‌లోని సభ్యులు కూడా ఆట మీద కంటే కబుర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వచ్చిన కుమార్ సాయి మొదటి వారం నుంచే ఎలిమినేషన్ లిస్ట్‌లో కొనసాగుతున్నాడు. ఇక మరో నటి స్వాతి దీక్షిత్ వచ్చిన మొదటి వారంలోనే నామినేట్ అయ్యింది. ఆమెకి తోడు అభిజిత్. హౌస్ లో ఎక్కడ చూసినా ఇద్దరూ కనిపిస్తుంటారు.. నామినేషన్‌లో కూడా ఒకరికొకరు తోడన్నట్లుగా ఉన్నారు. ప్రాధాన్యత లేని కొందరు హౌస్‌లో కొనసాగుతుండగా, టాలెంట్ ఉన్న వ్యక్తులు హౌస్ లో నుంచి బయటకు వెళ్లడంతో బిగ్ బాస్ చూడాలన్న ఆసక్తి తగ్గుతోంది సగటు ప్రేక్షకుడికి. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో సీజన్ 1 ఒక్కటే హైలెట్‌గా నిలిచిందని బుల్లి తెర ప్రేక్షకులు భావిస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com