Namibia Cheeta: మోదీ బర్త్‌డే స్పెషల్.. నమీబియా చిరుతలు ఇండియాకు..

Namibia Cheeta: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంచి కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని మోడీ కునో నేషనల్ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రారంభించారు. మూడు చిరుతలను క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేశారు. ఈ ఘటనతో భారత్ లో మళ్లీ చిరుతల గాండ్రింపులు వినిపించనున్నాయి. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా చీతాలను భారత్‌కు తీసుకువచ్చారు.
దాదాపు డెబ్బై ఏళ్ల తరువాత నమీబియా చిరుతలు ఇండియాకు చేరుకున్నాయి. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకువచ్చారు. ఇవాళ ప్రధాని మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో– పాల్‌పూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి ఈ చిరుతలను విడుదల చేశారు.
రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చిరుతలను ఇండియాకు తీసుకువచ్చారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్‌కు మార్పులు చేశారు. అయితే ఈ విమానం ముఖ భాగాన్ని ఫులి ముఖంతో డిజైన్ చేసిన ఫొటోను ఇప్పటికే అక్కడి ఇండియన్ కమిషన్ విడుదల చేసింది.
మరోవైపు నమీబియా నుంచి చిరుతలను తీసుకొస్తున్న బీ747 జైపుర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాలి అయితే అక్కడి నుంచి కునో నేషనల్ పార్క్ 400 కిలోమీటర్ల దూరం ఉండటంతో చిరుతల తరలింపు దూరాన్ని తగ్గించేందుకు గ్వాలియర్ వైమానిక స్థావరానికి మార్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com