జాతీయం

నిద్ర లేని రాత్రులు.. సూసైడ్ ఆలోచనలు..: నమిత

సన్నగా నాజూగ్గా ఉండి యువహృదయాలను కొల్లగొట్టిన నమిత.. ఆ తరువాత వచ్చిన బిల్లా, సింహా సినిమాల్లో బొద్దుగా కనిపించి

నిద్ర లేని రాత్రులు.. సూసైడ్ ఆలోచనలు..: నమిత
X

బొద్దుగుమ్మ నమిత 'సొంతం' అనే ప్రేమకథా చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సన్నగా నాజూగ్గా ఉండి యువహృదయాలను కొల్లగొట్టిన నమిత.. ఆ తరువాత వచ్చిన బిల్లా, సింహా సినిమాల్లో బొద్దుగా కనిపించి అందరికీ షాకిచ్చింది. కొంతకాలం క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నమిత మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

ఒకప్పుడు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నానని దాంతో మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. అయితే ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాననే విషయం కూడా నాకు తెలియకపోవడం బాధాకరం. రాత్రి పూట నిద్ర ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేదాన్ని. దాంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. అలా నా బరువు 97 కిలోలకు చేరింది. మద్యం తాగడం వల్ల బరువు పెరిగానని అందరూ అనుకున్నారు. కానీ నాకు థైరాయిడ్, పీసీఓడి వంటి సమస్యలు కూడా ఉన్నాయి.

వీటన్నిటితో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు.. దాదాపు ఐదేళ్లపాటు నరకం అనుభవించాను. ఆ తర్వాత కొందరి మంచి వ్యక్తుల సలహాతో యోగాలో జాయినయ్యాను. దాంతో మనశ్శాంతి లభించింది. నాకు కావలసిన శాంతి మంత్రాన్ని నాలోనే కనుగొన్నాను. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీరు దేని కోసమైతే బయటి ప్రపంచంలో వెతుకుతారో అది మీలోనే ఉంటుంది.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నమిత వివరించారు.

Next Story

RELATED STORIES