Narmada Mata: నీళ్లపై నడిచిన బామ్మ..

నీళ్లపై నడిచిందంటూ ఓ మహిళను దైవ సంభూతురాలిగా భావించి ఆమెను ఆరాధిస్తోన్న వింత ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో చోటుచేసుకుంది. నర్మదాపురానికి చెందిన జ్యోతి రఘువంశీ అనే వృద్ధ మహిళ నర్మదా నదిలో నడుస్తోందన్న వార్తలు వ్యాపించడంతో స్థానికులు నది వద్దకు భారీగా తరలి వచ్చారు. జ్యోతి రఘువంశీ నర్మదా నదిలో నీటిపై నడుస్తున్న వైనం తిలకించేందుకు జనాలు పోటెత్తడంతో పోలీసు బలగాలు సైతం రంగంలోకి దిగాయి. వృద్ధురాలు నదిలో నడక పూర్తి చేసిన అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు జనాలు ఎగబడ్డారు. నర్మదామాతా అంటూ నినాదాలు చేశారు. అయితే జ్యోతి రఘువంశి తాను దైవాంశ సంభూతురాలిని కాదని, ఆమెకు నీళ్లపై నడవడం రాదని స్వయంగా పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, 10 నెలల క్రితం సదరు మహిళ ఇంటి నుంచి తప్పిపోయిందని బంధువులు చెబుతున్నారు. ఆమె మానసిక ఆరోగ్యంపైనా సందేహాలు తలెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com